AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్విగ్గీతో మద్యం హోం డెలివరీ.. మందుబాబులు ఫుల్ హ్యాపీ..

మద్యం హోం డెలివరీ చేసేందుకు జార్ఖండ్ ప్రభుత్వం స్విగ్గీ, జొమాటోలతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో స్విగ్గీ మద్యం డెలివరీ సర్వీసులను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. జార్ఖండ్ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన తర్వాత సర్వీసులను ప్రారంభించిన స్విగ్గీ… దీని కోసం యాప్‌లో ‘వైన్ షాప్స్’ అనే ఆప్షన్‌ను ప్రవేశపెట్టినట్లు అధికారికంగా వెల్లడించింది. మరోవైపు కస్టమర్లు తమ వయసును ధృవీకరించుకోవడానికి ఏదైనా గవర్నమెంట్ ఐడీతో పాటు ఓ సెల్ఫీ […]

స్విగ్గీతో మద్యం హోం డెలివరీ.. మందుబాబులు ఫుల్ హ్యాపీ..
Ravi Kiran
|

Updated on: May 21, 2020 | 6:30 PM

Share

మద్యం హోం డెలివరీ చేసేందుకు జార్ఖండ్ ప్రభుత్వం స్విగ్గీ, జొమాటోలతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో స్విగ్గీ మద్యం డెలివరీ సర్వీసులను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. జార్ఖండ్ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన తర్వాత సర్వీసులను ప్రారంభించిన స్విగ్గీ… దీని కోసం యాప్‌లో ‘వైన్ షాప్స్’ అనే ఆప్షన్‌ను ప్రవేశపెట్టినట్లు అధికారికంగా వెల్లడించింది.

మరోవైపు కస్టమర్లు తమ వయసును ధృవీకరించుకోవడానికి ఏదైనా గవర్నమెంట్ ఐడీతో పాటు ఓ సెల్ఫీ ఫోటోను పొందుపరచాల్సి ఉంటుంది. డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, మైనర్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ ఈ నిబంధనను అమలులోకి తెచ్చింది. అటు అన్ని ఆర్డర్లకు ఓటీపీ ఉంటుందని.. మద్యం పరిమితిలో కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపింది. స్విగ్గీ ఇప్పటికే పలు రాష్ట్రాలతో మద్యం హోం డెలివరీ విషయంపై అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జార్ఖండ్ ప్రభుత్వం మద్యం దుకాణాల దగ్గర భారీ క్యూలైన్లు ఏర్పడకుండా ఉండేందుకే లిక్కర్ హోం డెలివరీకు అనుమతి ఇచ్చింది. ఇక జొమాటో మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read More: టిక్‌టాక్‌కు భారీ షాక్.. రేటింగ్స్ ఢమాల్..

Follow Us
కంకరరాళ్ల మధ్య ఇరుక్కున్న ఇయర్‌ బడ్.. 5 నిమిషాల్లో పట్టేసింది!
కంకరరాళ్ల మధ్య ఇరుక్కున్న ఇయర్‌ బడ్.. 5 నిమిషాల్లో పట్టేసింది!
'మన లక్ష్యం ఏమిటో మనకు తెలిస్తే చాలు.. నిరూపించాల్సిన పని లేదు'
'మన లక్ష్యం ఏమిటో మనకు తెలిస్తే చాలు.. నిరూపించాల్సిన పని లేదు'
కేంద్రం కీలక నిర్ణయం.. E85, E100 వాహనాలకు కొత్త రూల్స్
కేంద్రం కీలక నిర్ణయం.. E85, E100 వాహనాలకు కొత్త రూల్స్
ఆ కంటెస్టెంట్‌కు ఫేవర్‌గా బిగ్‌బాస్.. గీతూ రాయల్ హాట్ కామెంట్స్
ఆ కంటెస్టెంట్‌కు ఫేవర్‌గా బిగ్‌బాస్.. గీతూ రాయల్ హాట్ కామెంట్స్
ఎవ్వరూ చెప్పని విధంగా 3 నెలలు పక్కా నిల్వ ఉండే రొయ్యల పచ్చడి
ఎవ్వరూ చెప్పని విధంగా 3 నెలలు పక్కా నిల్వ ఉండే రొయ్యల పచ్చడి
ఏపీ ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ఏపీ ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఇంట్లో నల్ల చీమలు మంచిదేనా.. వాస్తు నమ్మకాలు ఏంటి.
ఇంట్లో నల్ల చీమలు మంచిదేనా.. వాస్తు నమ్మకాలు ఏంటి.
ఉద్యోగ యోగం, ధనలాభం..బుధుడు అస్తంగత్వంతో వీరికి జాక్‌పాట్..!
ఉద్యోగ యోగం, ధనలాభం..బుధుడు అస్తంగత్వంతో వీరికి జాక్‌పాట్..!
ముగ్గురు వ్యాపారులు.. 50 బంగారు నాణేలు మాయం! అసలు దొంగ ఎవరు?
ముగ్గురు వ్యాపారులు.. 50 బంగారు నాణేలు మాయం! అసలు దొంగ ఎవరు?