వ్యాక్సిన్ తయారీ కోసం హాలీవుడ్ దంపతుల రక్తదానం
మార్చి నెలలో పాజిటివ్‌గా తేలిన టామ్ హ్యాంక్స్ దంపతులు.. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ కోసం సహకరిస్తున్నారు. దీనిలో భాగంగా వారిద్దరూ తమ రక్తాన్ని దానం చేశారు.
హాలీవుడ్ హీరో టామ్ హ్యాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్‌కు ఇటీవల కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నప్పుడు వారికి వైరస్ పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే 14 రోజుల క్వారెంటైన్ తర్వాత వాళ్లు తిరిగి అమెరికా వెళ్లారు. మార్చి నెలలో పాజిటివ్‌గా తేలిన టామ్ హ్యాంక్స్ దంపతులు.. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ కోసం సహకరిస్తున్నారు. దీనిలో భాగంగా వారిద్దరూ తమ రక్తాన్ని దానం చేశారు. తమ శరీరాల్లో ఉన్న యాంటీబాడీలు వ్యాక్సిన్ తయారీకి ఉపయోగపడుతాయో లేదో వేచి చూడాల్సి ఉంటుందని రీటా విల్సన్ ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ వీలైతే తమ ప్లాస్మాను కూడా ఇతర పేషెంట్లకు డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆమె చెప్పారు.