విద్యార్థులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే టెన్త్ ఒరిజినల్ మెమోలు..
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో పదో తరగతి విద్యార్థులందరినీ పరీక్షలు రాయకుండానే పాస్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇప్పటికే పాసైన విద్యార్థులందరికీ...

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో పదో తరగతి విద్యార్థులందరినీ పరీక్షలు రాయకుండానే పాస్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇప్పటికే పాసైన విద్యార్థులందరికీ షార్ట్ మెమోలను అధికారిక వైబ్‌సైట్‌లలో పొందుపరిచింది ఎస్‌ఎస్‌సీ బోర్డు. అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే.. సవరణకు కూడా గడువు ఇచ్చి దాన్ని రెండు సార్లు పొడిగించింది.
ఇక ఇప్పుడు రాష్ట్రంలో టెన్త్ పాస్ అయిన విద్యార్థులందరికీ త్వరలోనే ఒరిజినల్ లాంగ్ లెన్త్ సర్టిఫికేట్లను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో టెన్త్ క్లాస్ ఒరిజినల్ మోమోలు వస్తాయని తెలిపారు. ఇక మోమోల పంపిణీ కంటే ముందు స్టూడెంట్స్ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు లాంటి తప్పులు, అక్షర దోషాలు సరిచేసుకోవడానికి అవకాశం కల్పించామని చెప్పారు. అలాగే స్కూళ్ల వారీగా ఒరిజినల్ లాంగ్ మోమోలు పంపిస్తామని బోర్డు అధికారులు పేర్కొన్నారు.
Read More:



