Telangana coronavirus: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో కొత్తగా 463 మందికి పాజిటివ్
ఆదివారం రాత్రి 8గంటల నుంచి సోమవారం రాత్రి 8గంటల వరకు 42,461 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 463 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Telangana Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మరింత భయపెడుతోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం రాత్రి 8గంటల నుంచి సోమవారం రాత్రి 8గంటల వరకు 42,461 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 463 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,07,205కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది.
కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో నలుగురు ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1694కు చేరింది. కరోనా బారి నుంచి శనివారం 364మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం 4,678 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారుల పేర్కొన్నారు. వీరిలో 1,723 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగ, మిగిలిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలావుంటే, ఒక జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 145 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,00,95,487 కొవిడ్ టెస్టులు నిర్వహించారు.