కరోనా ఉధృతిః తెలంగాణలో రోజు రోజుకూ కొత్త కేసులు..
కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 809కి చేరగా..

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 809కి చేరగా… 186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 605 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అటు కరోనా భారినపడి 18 మంది మరణించారు. శనివారం అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
మొత్తంగా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,247 కాగా వారందరికీ పరీక్షలు పూర్తయ్యాయి. వారి ద్వారా నేరుగా కాంటాక్ట్ అయినవారు 2,593 మంది ఉండగా వాళ్లకు కూడా పరీక్షలు నిర్వహించారు. నారాయణపేట్ అభాంగాపూర్‌కు చెందిన రెండు నెలల చిన్నారి అస్వస్థతకు గురవడంతో నిలోఫర్‌కు తరలించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారి గాంధీ ఆస్పత్రికి ఆ కుటుంబంలోని ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్ రావడం వైద్యులను తీవ్రంగా కలవర పెడుతోంది. హాస్పిటల్‌లో నిత్యం 300 మంది వైద్యులు, 400 మంది నర్సులు, మరో 500 మంది నాలుగో తరగతి సిబ్బంది, వైద్య విద్యార్థులు విధులు నిర్వర్తిస్తుంటారు. వీరందిరకీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ మసీదుల్లో దాక్కున్న పలువురు విదేశీయులపై కేసు నమోదు చేశారు పోలీసులు. పంజాగుట్ట మసీదులో ఉన్న 9 మంది కిర్గిస్తానీయులు.. ఫలక్‌నూమా మసీదులో ఉన్న ఆరుగురు ఇరానీలపై కేసులు పెట్టారు.
