కేంద్రం హెచ్చ‌రికః అలా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూనే క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల మ‌రీ అతిజాగ్ర‌త్త‌తో ..

కేంద్రం హెచ్చ‌రికః అలా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు..
Follow us

|

Updated on: Apr 19, 2020 | 10:48 AM

ప్ర‌స్తుతం దేశంలో అంద‌రినీ వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌జ‌లు త‌మవంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూనే క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప‌రిస‌రాల్లో .. రసాయనాలు, పొడులు, పురుగు మందులు, స్ప్రేల‌ను చ‌ల్లుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల మ‌రీ అతిజాగ్ర‌త్త‌తో మ‌నుషుల‌పైన కూడా శానిటైజ‌ర్లు చ‌ల్లుతున్నారు. అటువంటి వారికి కేంద్రం గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది.

వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఇక‌పై వ్యక్తులపై లేదా గ్రూపులపై ర‌సాయ‌నాలు, శానిటైజ‌ర్లు చల్లడానికి వీల్లేద‌ని కేంద్రం తేల్చిచెప్పింది. కరోనా సోకితే… వారిపై ఈ ద్రావణాలు చల్లడం వల్ల ఉపయోగం లేదనీ, శ‌రీరంలోప‌ల ఉన్న కరోనా… బయట స్ప్రేలు చల్లితే ఎలా చస్తుందని కేంద్రం ప్రశ్నిస్తోంది. ఇలాంటి స్ప్రేల వల్ల కరోనా చనిపోతుందనేందుకు ఆధారాలు లేవని చెప్పింది. ఈ రసాయనాలను ఇళ్లలో తలుపులు, కిటికీలు, ఫ్లోర్లను క్లీన్ చేయడానికి వాడాలి గానీ… మనుషులపై కాదని చెప్పిన కేంద్రం… వీటిని చల్లే టప్పుడు చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలని సూచించింది.

అంతేగానీ, స్ప్రేలు చల్లితే… కళ్లు, చర్మం పాడవుతాయనీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయనీ, వికారం, వాంతుల వంటివి వస్తాయని ఇంకా అనేకానేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉత్ప‌న్నమ‌య్యే ప్ర‌మాదం  ఉంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఇలాంటివి చెయ్యకుండా… ఎప్ప‌టిక‌ప్పుడు చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కొని…సామాజిక దూరం పాటించాల‌ని కేంద్రం సూచించింది.  కాదని ఎవరైనా రసాయనాల్ని మనుషులపై చల్లితే… పాండెమిక్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..