ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

సాధారణంగా ఎప్పుడూ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి వస్తాయి. కానీ ఈ సారి కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో కాస్త ముందే రాబోతున్నాయి. ఇందుకు కారణమేంటంటే.. ఎంసెట్, జేఈఈ, డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఈ నెలాఖరు వరకూ తెలంగాణ లాక్‌డౌన్, మే 3 వరకూ..

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 10:58 AM

సాధారణంగా ఎప్పుడూ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి వస్తాయి. కానీ ఈ సారి కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో ఇంటర్మీడియ్ సెకండియర్ పరీక్షా ఫలితాలు కాస్త ముందే రాబోతున్నాయి. ఇందుకు కారణమేంటంటే.. ఎంసెట్, జేఈఈ, డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఈ నెలాఖరు వరకూ తెలంగాణ లాక్‌డౌన్, మే 3 వరకూ కేంద్రం లాక్‌డౌన్ కొనసాగుతుంది. దీంతో వాల్యుయేషన్ ఎప్పుడు చేయాలనే అంశంపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ప్రతీ ఏడాది ఈ పాటికే వాల్యుయేషన్ మొదలయ్యేది. ఇప్పుడు కరోనా కారణంగా అది మొదలు కాలేదు. దీంతో ముందుగానే మే 5 నుంచి 6 తేదీ నుంచి వాల్యుయేషన్ చేపట్టాలని బోర్డు డిసైడైంది. ఒకసారి ప్రభుత్వంతో చర్చించి ఫైనల్ నిర్ణయం ప్రకటించనుంది.

కాగా ఈ సమయానికి ఎంసెట్‌తో పాటు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌ పరీక్షలు అయిపోవాల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా పడ్డాయి. అందువల్ల సెకండ్ ఇయర్ రిజర్ట్స్ ముందుగా రిలీజ్ చేసి.. వెంటనే ఎంట్రన్స్ పరీక్షలు జరిపించే ఆలోచనలో ఉంది ఇంటర్‌ బోర్డు. అలాగే వాల్యూయేషన్ చేపట్టిన 20 రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చేలా చేయాలనుకుంటోంది ఇంటర్ బోర్డు. వాల్యూయేషన్ టైంలో సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి కాబట్టి.. ఎక్కువ మూల్యాంకన కేంద్రాలు కావాలి. కాబట్టి ఆల్రెడీ ఉన్న 12 కేంద్రాలతో పాటూ మరో రెండు కేంద్రాల్ని సిద్ధం చేయబోతున్నట్లు తెలిసింది. కాగా మార్చి 4 నుంచి 23 వరకూ జరిపిన ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల మంది హాజరయ్యారు. ఫస్టియర్ విద్యార్థులు 4.80 లక్షలు ఉండగా.. 4.85 లక్షల మంది సెకండియర్ విద్యార్థులున్నారు. అలాగే మే నెల చివరి కల్లా కరోనా వైరస్ పూర్తిగా తగ్గు ముఖం పడితే.. జూన్ నుంచి ఎప్పటిలాగా విద్యా సంవత్సరం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

Read More: 

టీఎస్ కీలక కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌ సడలింపుపై చర్చ

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!

84 ఏళ్ల వయసులో కూడా ‘బాలను రా మదనా’ అంటూ జమున డ్యాన్స్