రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!

కరోనా వైరస్ కారణంగా.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్ విధించింది మంచికే అయినా.. ఇప్పుడు అది తీవ్ర నష్టాలకు తెరతీస్తుంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ విషయంలో..

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 8:57 AM

కరోనా వైరస్ కారణంగా.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్ విధించింది మంచికే అయినా.. ఇప్పుడు అది తీవ్ర నష్టాలకు తెరతీస్తుంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ విషయంలో కొన్ని సడలింపులు చేసింది. అందువల్ల సోమవారం నుంచి దేశంలో మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడనే అవకాశాలు ఎంతో కొంత కనిపించనున్నాయి. ఇప్పటికే నెల రోజులగా దేశ మొత్తాం లాక్‌డౌన్ కారణంగా స్తంభించిపోయింది. కేంద్రంతో పాటు.. అన్ని రాష్ట్రాలకూ ఆదాయాలు లేకుండా పోయాయి. ఇలాగే కనుక కంటిన్యూ అవుతూ ఉంటే.. దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం ఈ సడలింపులు ఇచ్చింది. అయితే వీటిని అమలు చేస్తాయా.. లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. కాగా ఇప్పటికే వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు చేశాయి.

కేంద్రం ప్రకటించిన సడలింపులు:

1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆఫీసులు తెరుచుకుంటాయి 2. అత్యవసర సేవలకు, వైద్య, అత్యవసర సరుకులు, తాము పనిచేసే ఆఫీస్‌కి వెళ్లడానికి ప్రైవేటు వాహనాలకు అనుమతి 3. గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ యూనిట్ల పరిశ్రమలు తెరవచ్చు 4. అలాగే మూవీ థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్, స్మిమ్మింగ్ ఫూల్స్, బార్లు మాత్రం మే నెల 3వ తేదీ వరకూ తెరవకూడదు 5. బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లు కూడా మే 3 వరకూ లాక్‌డౌన్‌లోనే ఉంటాయి 6. అత్యవసర, నిత్యవసర సరుకుల సరఫరా కొనసాగనుంది 7. వాణిజ్య, ప్రైవేటు వర్తక సంస్థలకు, ప్రభుత్వ, ప్రభుత్వేతర పారిశ్రామిక సంస్థలు పనిచేయవచ్చు 8. విద్యా సంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రలూ మే 3 వరకూ తెరవకూడదు 9. నిర్మాణ రంగ కార్యకలాపాలు చేపట్టవచ్చు. అయితే కార్మికులు నిర్మాణం దగ్గరే నివసించాలి 10. అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి ఎవరూ పాల్గొనకూడదు 11. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లీనిక్స్, టెలీ మెడిసన్ సర్వీసులు రోజూ పనిచేస్తాయి. దాదాపు అన్ని రకాల మందుల షాపులు తెరిచే ఉంటాయి 12. అలాగే మే 3 వరకూ ఫంక్షలు, వేడుకలు, మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనా స్థలాలూ క్లోజ్ చేసే ఉంటాయి.