లాక్ డౌన్ ని పట్టించుకోవద్దని ట్రంప్ పిలుపు.. అమెరికా వీధుల్లో వేలాది ప్రజలు

కరోనా సంబంధ లాక్ డౌన్ కి నిరసనగా శనివారం వేలాది ప్రజలు వీధుల్లోకి వఛ్చి ప్రదర్శనలు చేశారు. లాక్ డౌన్ పాటించాలంటూ వివిధ రాష్ట్రాల గవర్నర్లు ఇఛ్చిన ఉత్తర్వులను ధిక్కరించాలంటూ స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునివ్వడంతో ఇక వారి ఉత్సాహానికి అంతులేకపోయింది...

లాక్ డౌన్ ని పట్టించుకోవద్దని ట్రంప్ పిలుపు.. అమెరికా వీధుల్లో వేలాది ప్రజలు
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 8:27 PM

కరోనా సంబంధ లాక్ డౌన్ కి నిరసనగా శనివారం వేలాది ప్రజలు వీధుల్లోకి వఛ్చి ప్రదర్శనలు చేశారు. లాక్ డౌన్ పాటించాలంటూ వివిధ రాష్ట్రాల గవర్నర్లు ఇఛ్చిన ఉత్తర్వులను ధిక్కరించాలంటూ స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునివ్వడంతో ఇక వారి ఉత్సాహానికి అంతులేకపోయింది. మిచిగాన్, మిన్నెసోటా, వర్జీనియా రాష్ట్రాలను లాక్ డౌన్ నుంచి విముక్తం చేయాలని ఆయన కోరారు. (ఈ రాష్ట్రాలే డెమొక్రాట్లే గవర్నర్లుగా ఉన్నారు). న్యూ హాంప్ షైర్ లోని  కంకార్డ్ లో వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా సుమారు 400 మంది గుమి కూడారు. లాక్ డౌన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా కేసులు తక్కువగా ఉన్న చోట్ల క్వారంటైన్ లు ఎందుకని వారు ప్రశ్నించారు. మొదట మన దేశ ఆర్థికవ్యవస్థను పునరుజ్జీవింపజేద్దాం అని కూడా స్లోగన్స్ ఇఛ్చారు. సామాజిక దూరాన్ని ఎవరూ పాటించినట్టు కనబడలేదు. ‘పేదరికం కూడా మనల్ని చంపేస్తుంది’ అని రాసి ఉన్న ప్లకార్డులను అనేకమంది పట్టుకున్నారు. టెక్సాస్ లో కూడా ఇదే పరిస్థితి ! అమెరికాలో మరే ఇతర దేశాలకన్నా ఎక్కువగా కరోనా మరణాలు సంభవించాయి. 718,000 కన్ఫార్మ్డ్ కేసులు నమోదు కాగా.. 37, 700 మంది కరోనా రోగులు మరణించారు.