AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చే రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..
Ravi Kiran
|

Updated on: May 17, 2020 | 7:15 AM

Share

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చే రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారందరికీ మూడు రోజులుగా ప్రభుత్వం పాసుల జారీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పాసులు జారీ చేయొద్దని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మరణాల రేటు తక్కువ ఉన్నప్పటికీ.. ఇరు రాష్ట్రాల మధ్య విస్తృత రాకపోకలను దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా సరిహద్దు ప్రాంతాలైన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

కాగా, దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన సుమారు 80 వేల మంది తెలంగాణ వాసులు అత్యవసర పాసుల ద్వారా తిరిగి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ఇక అలా వచ్చిన వారికి వైద్య అధికారులు చెక్ పోస్ట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే తిరిగి పంపించేస్తారు. అటు లక్షణాలు లేనివారి చేతులపై 14 రోజుల హోం క్వారంటైన్ ముద్రను వేసి ఇళ్లకు పంపుతారు.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు