లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో మూతపడిన ఆలయాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల భద్రతా లాంటి పలు విషయాలపై చర్చించి దేవాదాయశాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని ప్రధాన ఆలయ ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి మొదలుకానున్న నాలుగోదశ లాక్ డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆలయ దర్శనాలకు అనుమతిస్తే ఈ […]

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!
Follow us

|

Updated on: May 16, 2020 | 11:57 AM

కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో మూతపడిన ఆలయాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల భద్రతా లాంటి పలు విషయాలపై చర్చించి దేవాదాయశాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని ప్రధాన ఆలయ ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి మొదలుకానున్న నాలుగోదశ లాక్ డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆలయ దర్శనాలకు అనుమతిస్తే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..

  •  రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకునే ముందు ఆన్లైన్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకోవాలి
  • ఈ స్లాట్ బుకింగ్ 24 గంటలు ముందుగా చేసుకోవాలి
  • ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే దర్శనాలకు అనుమతి
  • గంటకు 250 మంది దర్శనం చేసుకునేందుకు వీలు ఉంటుంది
  • భక్తులు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి
  • హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలి
  • అంతరాలయ దర్శనానికి అనుమతి లేదు
  • శఠగోపం, తీర్థం పంపిణీ లాంటివి తాత్కాలికంగా నిషేధం
  • ఎప్పటికప్పుడు గుడి పరిసరాలను, క్యూ లైన్లను సోడియం హైపోక్లోరైడ్‌తో స్ప్రే చేయాలి

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

దేశంలో కొత్త వైరస్ కలకలం.. 15,000 పందులు మృతి..