Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 772 కరోనా పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,10,141 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 772 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలుపుకుని....
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,10,141 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 772 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,13,872కు చేరుకుంది. కొవిడ్-19 కారణంగా తాజాగా 7 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,710 మంది చనిపోయారు. మరో 748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472గా ఉంది.
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి..
ఆదిలాబాద్-3, భద్రాద్రి కొత్తగూడెం-28, జీహెచ్ఎంసీ-88, జగిత్యాల-18, జనగాం-6, జయశంకర్ భూపాలపల్లి-16, జోగులాంబ గద్వాల-1, కామారెడ్డి-2, కరీంనగర్-48, ఖమ్మం-86, కొమురంభీం ఆసిఫాబాద్-4, మహబూబ్‌నగర్-8, మహబూబాబాద్-33, మంచిర్యాల-47, మెదక్-4, మేడ్చల్ మల్కాజ్‌గిరి-35, ములుగు-18, నాగర్‌కర్నూలు-8, నల్లగొండ-57, నారాయణపేట-4, నిర్మల్-4, నిజామాబాద్-8, పెద్దపల్లి-41, రాజన్న సిరిసిల్ల-16, రంగారెడ్డి-35, సంగారెడ్డి-10, సిద్దిపేట-21, సూర్యాపేట-37, వికారాబాద్-3, వనపర్తి-9, వరంగల్ రూరల్-6, వరంగల్ అర్బన్-51, యాదాద్రి భువనగిరి-17.
డెల్టా కంటే లామ్డా మరీ ప్రమాదకరం..!
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా కొత్త రకాలు టెన్షట్ పెడుతున్నాయి. వాటిలో డెల్టా వేరియంట్ ప్రమాదకరమని ఆందోళన చెందుతుండగా.. లామ్డా వేరియంట్ అంతకంటే ప్రాణాంతకమని మలేసియా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ రకం ఇప్పటికే ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. గత నాలుగు వారాల్లో దాదాపు 30 దేశాల్లో దీన్ని గుర్తించారు. ఈ లామ్డా వేరియంట్‌ను మొదట పెరూలో గుర్తించారు. కాగా లామ్డా వేరియంట్ తీవ్రత ఏమేరకు ఉందో తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ దృష్టిసారించాయి.
Also Read: మాటు వేసి కాటు వేస్తున్నాయి.. బుసలు కొడుతూ బెంబేలెత్తిస్తున్నాయి.. ప్రతి నిమిషం టెన్షన్, టెన్షన్