కళ్ల ఎదుటే చావు.. అది చూసిన మరో వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం.. ఎక్కడంటే?

కళ్ల ఎదుటే చావు.. అది చూసిన మరో వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం.. ఎక్కడంటే?
Crime News

చావు అన్నది ఎవరూ తప్పించుకోలేని సత్యం. మరణం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. ఆ కారణంతోనే మరణం ఎవరికీ తెలియని సృష్టి రహస్యం అంటారు.

Janardhan Veluru

|

Jul 07, 2021 | 5:55 PM

చావు అన్నది ఎవరూ తప్పించుకోలేని సత్యం. మరణం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. ఆ కారణంతోనే మరణం ఎవరికీ తెలియని సృష్టి రహస్యం అంటారు. అందుకే కొన్ని అరుదైన కారణాలలో సంభవించే మరణాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. కర్ణాటకలో ఈ తరహాలోనే ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. మంగళూరుకు సమీపంలోని కావూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికుడైన జోచిమ్(58) సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చేపలుపడుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయిన ఆ వ్యక్తి క్షణాల్లో విగత జీవిగా మారాడు.

ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న మరో వ్యక్తి…గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుండెపోటుతోనే ఆయన హఠాన్మరణం చెందినట్లు వైద్యులు తెలిపారు. కళ్ల ఎదుట ఓ వ్యక్తి నీటిలో పడి మరణించడాన్ని చూసిన ఆ వ్యక్తి షాక్‌తో గుండెపోటుకు గురైనట్లు తేల్చారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read..

Viral Video: ప్రేమంటే ఇదేరా.. రోజూ అన్నం పెట్టే అవ్వకు జ్వరమొచ్చిందని.. !

ఆఫ్ట్రాల్ ఫోన్ నంబర్ కోసం సూసైడ్ వరకూ వెళ్లాడు.. పిచ్చా..? వెర్రా..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu