Telangana Corona Cases: తెలంగాణ‌లో కొత్త‌గా 4,298 కరోనా కేసులు, 32 మరణాలు

తెలంగాణ‌లో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతుంది. కొత్త‌గా 64,362 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా 4,298 కరోనా కేసులు వెలుగుచూశాయి....

Telangana Corona Cases:  తెలంగాణ‌లో కొత్త‌గా 4,298 కరోనా కేసులు, 32 మరణాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: May 15, 2021 | 8:10 PM

తెలంగాణ‌లో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతుంది. కొత్త‌గా 64,362 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా 4,298 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,25,007కి చేరింది. మ‌రో 32 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచిన‌ట్లు వైద్యారోగ్య శాఖ శ‌నివారం విడుద‌ల చేసిన బులిటెన్ లో తెలిపింది. ఫ‌లితంగా మొత్తం మ‌ర‌ణాల సంఖ్య‌ 2,928కి చేరింది. కొత్త‌గా వైరస్‌ నుంచి మరో 6,026 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్‌ఎంసీలో 601మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. రంగారెడ్డి జిల్లాలో 267, మేడ్చల్‌ మల్కాజిగిరి 368 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

దేశంలో వ్యాక్సినేష‌న్ వివ‌రాలు….

దేశంలోని 10 రాష్ట్రాల్లో 67శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు మోదీ స‌ర్కార్ వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 60ఏళ్లు పైబడిన వారిలో 39.9శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు వివ‌రించింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసువారిలో 45.5శాతం మందికి; 30 నుంచి 45 ఏళ్ల వారిలో 9.4శాతం; 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కుల్లో 5.2శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు తెలిపింది. 18 నుంచి 44 ఏళ్ల వారిలో 42లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొంది. కాగా ఏపీలో 18 నుంచి 44 వారిలో 2624మందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. తెలంగాణలో ఆ సంఖ్య 500గా ఉన్నట్టు తెలిపింది.

Also Read: క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను..

కిర్రాక్ సీన్.. చేప మెడ‌లో వెడ్డింగ్ రింగ్.. మ్యాట‌ర్ ఏంటంటే…

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..