ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీల‌క అంశాలు..సీఎం నిర్ణయంపై ఉత్కంఠ..

ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీల‌క అంశాలు..సీఎం నిర్ణయంపై ఉత్కంఠ..

తెలంగాణలో లాక్‌‌డౌన్ పొడిగింపు ఎల్లుండితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Jyothi Gadda

|

May 05, 2020 | 7:18 AM

తెలంగాణలో లాక్‌‌డౌన్ పొడిగింపు ఎల్లుండితో ముగియనుంది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలను తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి లాకడౌన్‌ 3తో ముగియనున్న దశలో దానిని 7వరకు పొడిస్తూ సిఎం కెసిఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు కేబినేట్‌లో చర్చించి ఆవెూందించారు. పరిస్థితిని స‌మీక్షించి మళ్లీ 5న జరిగే కేబినేట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్‌ ప్రకటించారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు. సరికదా రెడ్‌జోన్ల సంఖ్య పెరిగింది. ప్రతిరోజూ సీఎం పరిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ఈ లోగా లాకడౌన్‌ను కేంద్రం 17వరకు పొడించింది. అలాగే కొన్ని సడలింపులు ఇచ్చింది. తెలంగాణ సర్కార్‌ 7వరకు పెట్టిన గడువును మించి 17 వరకు పొడిగించారు. ఈ దశలో తదుపరి చర్యలపై కేబినేట్‌ చర్చించనుంది.

రాష్ట్రంలో కూడా వైన్స్‌ షాపులు తెరవాలన్న డిమాండ్‌ ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ప్రధానంగా ఎక్సైజ్‌ శాఖ నుంచే వస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో కేంద్రం సూచించిన విధంగా గ్రీన్‌జోన్ల పరిధిలో మద్యం విక్రయాలకు అనుమతులు ఇస్తే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న అంశంపై కూడా లోతుగా సిఎం కేసీఆర్ చర్చించనునట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ మద్యం విక్రయాలకు అనుమతులు ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి ఎన్ని గంటల పాటు అనుమతించాలి అన్న అంశంపై సీఎం ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఈ అంశాలపై ఇవాళ్టి క్యాబినెట్‌ సమావేశంలో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మంత్రులు మూడోసారి భేటీ కానున్న నేపథ్యంలో.. లాక్‌డౌన్ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల, గ్రీన్ జోన్ల పరిధిలో పరిశ్రమలు అనుమతులతో సహా ఇతర అంశాలు చర్చించనున్నారు. ఈ క్ర‌మంలోనే ఇవాళ్టి కేబినెట్ భేటిపై స‌ర్వ‌త్వ ఉత్కంఠ నెల‌కొంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu