షాకింగ్ న్యూస్ః మేక‌, బొప్పాయి పండుకు క‌రోనా పాజిటివ్ !

షాకింగ్ న్యూస్ః మేక‌, బొప్పాయి పండుకు క‌రోనా పాజిటివ్ !

కోవిడ్-19 వైర‌స్ వ్యాప్తికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైర‌స్ మ‌నుషుల‌కు, పిల్లు ల‌కు, పులుల‌కు వంటి కొన్ని జంతువుల‌కూ వ‌చ్చింది‌. అయితే ఇక్క‌డ విచిత్రం ఏంటంటే.. ఓ మేక‌కు,  బొప్పాయి పండుకు క‌రోనా సోకింది. ఈ వింత సంఘ‌ట‌న టాంజానియాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… ప్ర‌పంచ దేశాల‌తో పాటు టాంజానియా దేశంలో క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోంది. దీంతో వైర‌స్ నిర్ధార‌ణ చేసే టెస్ట్ కిట్ల‌ను ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి […]

Jyothi Gadda

|

May 05, 2020 | 12:13 PM

కోవిడ్-19 వైర‌స్ వ్యాప్తికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైర‌స్ మ‌నుషుల‌కు, పిల్లు ల‌కు, పులుల‌కు వంటి కొన్ని జంతువుల‌కూ వ‌చ్చింది‌. అయితే ఇక్క‌డ విచిత్రం ఏంటంటే.. ఓ మేక‌కు,  బొప్పాయి పండుకు క‌రోనా సోకింది. ఈ వింత సంఘ‌ట‌న టాంజానియాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

ప్ర‌పంచ దేశాల‌తో పాటు టాంజానియా దేశంలో క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోంది. దీంతో వైర‌స్ నిర్ధార‌ణ చేసే టెస్ట్ కిట్ల‌ను ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంది. దీన్ని మ‌నుషుల‌తోపాటు బొప్పాయి, మేక, గొర్రెల‌ ‌పైనా ప‌రీక్షించింది‌. ఈ క్ర‌మంలోనే గొర్రె మిన‌హా మిగ‌తా రెండింటికి వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. వైర‌స్ టెస్ట్ కిట్లలో నాణ్య‌తా లోపం కార‌ణంగానే ఇలాంటి త‌ప్పుడు ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని అక్క‌డి వైద్యాధికారులు నిర్ధారించారు. త‌ప్పుడు ఫ‌లితా‌లివ్వ‌డంతో కిట్ల‌లో డొల్లత‌నం బ‌య‌ట‌ప‌డింద‌ని, ఆ దేశ అధ్య‌క్షుడు జాన్ మ‌గుఫులి దిగుమ‌తి చేసుకున్న టెస్టు కిట్ల‌లో సాంకేతిక లోపాలున్నాయ‌ని వెల్ల‌డించారు. వీటి వాడ‌కాన్ని నిలిపివేస్తూ ద‌ర్యాప్తుకు ఆదేశించారు. ఇదిలా ఉంటే, అక్క‌డ ప‌ది ల‌క్ష‌ల మందికి గానూ కేవ‌లం 500 మందికి మాత్ర‌మే ప‌రీక్ష‌లు చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu