ఆ 4 జిల్లాల్లో లాక్‌డౌన్ మరింత కఠినం.. 

ఆ 4 జిల్లాల్లో లాక్‌డౌన్ మరింత కఠినం.. 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలంగాణలో హైదారాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని సీఎం కేసీఆర్‌కు వైద్యాధికారులు వివరించారు. కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్‌తో మరణిస్తున్న

TV9 Telugu Digital Desk

| Edited By:

May 05, 2020 | 11:38 AM

Lockdown should implement: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలంగాణలో హైదారాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని సీఎం కేసీఆర్‌కు వైద్యాధికారులు వివరించారు. కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్‌తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నమరో 3 జిల్లాల వారే ఉంటున్నారని తెలిపారు. కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో లాక్ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని వారు సిఎంను కోరారు.

మరోవైపు.. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణి, సీనియర్ వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎనిమిది గంటల పాటు సాగిన సమీక్షలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నిబంధనల సడలింపు అంశాలు చర్చకు వచ్చాయి.

కాగా.. సోమవారం మూడు కేసులు నమోదు కావడం, 40 మంది కోలుకుని డిశ్చార్జి కావడం శుభసూచకమని సిఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu