తమిళనాడులో కరోనా విలయ తాండవం.. తాజాగా మరో 6,472 పాజిటివ్ కేసులు..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం కూడా ఒకటి. నిత్యం ఇక్కడ మూడు నుంచి ఆరు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,92,964కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52,939 యాక్టివ్ కేసులు ఉన్నాయని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,36,793 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి.
Tamil Nadu reports 6,472 new #COVID positive cases and 88 deaths today. Total number of cases stand at 1,92,964 including 52,939 active cases, 1,36,793 discharged cases and 3,232 deaths: State Health Department pic.twitter.com/zlJpuwjFKo
— ANI (@ANI) July 23, 2020