తమిళనాడులో 3.67 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిత్యం ఐదువేలకు పైగా..

తమిళనాడులో 3.67 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 9:42 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిత్యం ఐదువేలకు పైగా నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే 3.67 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 53 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,995 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,430కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 3,07,677 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం