ఓ మట్టి గణపయ్య.. మా ఇంటికి రావయ్య
ఓ వైపు కరోనా, మరోవైపు ప్రకృతి... మట్టి గణపతులకు డిమాండ్ చాలా పెరిగింది. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను కొనేందుకు హైదరాబాద్ వాసులు ఇష్ట పడుతున్నారు. గణే శ్ ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు
ఓ వైపు కరోనా, మరోవైపు ప్రకృతి… మట్టి గణపతులకు డిమాండ్ చాలా పెరిగింది. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను కొనేందుకు హైదరాబాద్ వాసులు ఇష్ట పడుతున్నారు. గణే శ్ ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు పెట్టాలని పర్యావరణ వేత్తలు ప్రచారం నిర్వహించడంతో ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా టీవీ9 చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహలను కొనేందుకు హైదరాబాద్ వాసులు ఇష్టపడుతున్నారు.
దీనికి తోడు వివిధ సంస్థలు, స్టార్టప్ లు మట్టి విగ్రహాలు తయారు చేసి అమ్ముతున్నాయి. వోకల్ ఫర్ లోకల్, గ్రీన్ ఛాలెంజ్‌కు పెరుగుతున్న సమయంలో ప్రజల్లో అవగాహన పెరిగి ఈ సారి మట్టి వినాయకులపై ఆసక్తి పెరిగింది. మట్టి గణపతి అయితే ఇంట్లోనే పూజలు చేసి కుండీలో నిమజ్జనం చేయొచ్చని భావిస్తున్నారు. ఎక్కువ మంది సీడ్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలనే కొనేందుకు ఇష్టపడుతున్నారు. సీడ్ గణపతి కొన్నవారికి వినాయక విగ్రహంతోపాటు కుండీ, పూజా సామగ్రిని ప్యాకేజీలో అందిస్తున్నారు.
నగరంలో మట్టి గణపతులను తయారుచేసి అమ్మేవారి సంఖ్య కూడా ఈ ఏడాది చాలా పెరిగింది. సీడ్ విగ్రహాలు ఎక్కు వ మంది అడుగుతున్నట్లు తెలిపారు. పూజల తర్వాత కుండీలో నిమజ్జనం చేస్తే అందులో నుంచి మొక్క వస్తుంది. మామూలు మట్టి గణపతులనూ కుండీల్లో ఈజీగా నిమజ్జనం చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో గణపతి విగ్రహాల ఎత్తుపై కూడా ఆంక్షలు విధించడంతో మార్కెట్ లో చిన్న వినాయకులకు డిమాండ్ పెరిగింది. కోవిడ్ నియమాలు పాటిస్తూ ప్రజలు తమ ఇళ్ళలోనే పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.