తమిళనాడులో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 3,616 పాజిటివ్ కేసులు

కరోనా మహమ్మారి తమిళనాడులో విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో కూడా ఇక్కడ ఎక్కువగానే కరోనా..

తమిళనాడులో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 3,616 పాజిటివ్ కేసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 08, 2020 | 12:50 AM

కరోనా మహమ్మారి తమిళనాడులో విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో కూడా ఇక్కడ ఎక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అన్‌లాక్‌ 1.0 తర్వాత.. రోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 3,616 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,594కి చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. దాదపు యాభై నుంచి డెబ్బై శాతం కేసులు చెన్నై నగరం నుంచే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 45,839 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే ఏడు లక్షల మార్క్‌ను దాటేసింది. ఈ మహమ్మారి వైరస్‌కు వ్యాక్సిన్‌ కానీ మెడిసిన్‌ కానీ లేకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి ఇప్పటికే హ్యూమన్‌ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌తో మంగళవారం నుంచి హ్యూమన్‌ క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతా అనుకున్నట్లుగా వ్యాక్సిన్‌ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌లో సక్సెస్‌ అయితే.. మరికొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది.

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..