ఈరోజు త‌మిళ‌నాడులో ఎన్ని క‌రోనా కేసులు న‌మోద‌య్యాయంటే?

తాజాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,996 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 102 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,09,238కి, మరణాల సంఖ్య 7050కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 5752 మంది కరోనా నుంచి..

ఈరోజు త‌మిళ‌నాడులో ఎన్ని క‌రోనా కేసులు న‌మోద‌య్యాయంటే?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 28, 2020 | 8:37 PM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే నిత్యం పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతూనే ఉంటున్నారు. ఇక కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలోకి చేరింది భారత్. అటు, తమిళనాడులో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,996 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 102 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,09,238కి, మరణాల సంఖ్య 7050కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 5752 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,49,682 మంది కోలుకోగా, ప్రస్తుతం 52,506 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది.