తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్. 2020-21 విద్యా సంవత్సరానికి గాను నూతన దరఖాస్తు కోసం ఎంహెచ్ఆర్డీ తెలంగాణ రాష్ట్రానికి 2,570 స్కాలర్‌షిప్‌లను కేటాయించింది.

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Aug 29, 2020 | 11:02 AM

Intermediate Scholarship: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. ఉన్నత విద్యను అభ్యసించుకోవాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందించనుంది. అందులో భాగంగానే 2020-21 విద్యా సంవత్సరానికి గాను నూతన దరఖాస్తు కోసం ఎంహెచ్ఆర్డీ తెలంగాణ రాష్ట్రానికి 2,570 మెరిట్ స్కాలర్‌షిప్‌లను కేటాయించింది. ఈ క్రమంలోనే వీటికి నూతన దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ 2020, అక్టోబర్ 31వ నిర్ణయించింది. అంతేకాకుండా 2016-17 నుండి 2019-2020 వరకు ఉన్న మెరిట్ స్కాలర్‌షిప్‌ల రెన్యువల్ చివరి తేదీ కూడా అక్టోబర్ 31గా స్పష్టం చేసింది. కాగా, ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని.. మార్చి 2020 ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్ https://scholarship.gov.in ద్వారా నూతన దరఖాస్తు చేసుకోవచ్చునని తెలంగాణ ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇక తాత్కాలికంగా ఎంపిక చేసిన విద్యార్థులు జాబితాను tsbie.ogg.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు.