అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరాన్ని హరిత వనంగా మారుస్తున్నామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని గ్రీన్‌ వ్యాలీ పార్కులో నిర్వహించిన ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాన్ని మేయర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు.

అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదు..
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 28, 2020 | 8:52 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరాన్ని హరిత వనంగా మారుస్తున్నామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని గ్రీన్‌ వ్యాలీ పార్కులో నిర్వహించిన ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాన్ని మేయర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పార్కుల్లో వారం పాటు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంతవరకూ కూల్చిన పాత భవనాలు 1750 వరకూ ఉన్నాయి. 2016లో 485 భవనాలు, 2017లో 294 భవనాలు, 2018లో 402 నిర్మాణాలు, 2019లో 453 ప్రమాదకర కట్టడాలను జీహెచ్‌ఎంసీ కూల్చివేసింది. ఈ ఏడాది ఇప్పటికే 119 పురాతన భవనాలను కూల్చివేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాతభవనాలను కూల్చడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామంటున్నారు నగర మేయర్‌ బొంత రామ్మోహన్‌. అదేవిధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలను నేలమట్టం చేయనున్నట్లు చెప్పారు. నగరంలో అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మేయర్‌ స్పష్టం చేశారు.

అసలే వర్షాకాలం. జీహెచ్‌ఎంసీ అంచనాల ప్రకారమే.. ప్రమాదపుటంచుల్లో ఉన్న పాత భవనాలు నాలుగు వేల వరకూ ఉన్నాయి. ఓవైపు నగర ప్రణాళికా విభాగం నోటీసుల మీద నోటీసులిస్తోంది. కానీ చాలామంది భవనాల యజమానులు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. ప్రజలు సహకరిస్తేనే జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న డ్రైవ్‌ సక్సెస్‌ అవుతుందంటున్నారు నగర మేయర్

ఇప్పటికే గ్రేటర్‌లో 900 పార్కులు ఉన్నాయన్నారు. అందులో నిరుపయోగంగా ఉన్న పార్కులకు పూర్వ వైభవం తేనున్నట్లు చెప్పారు. ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించుటకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొత్తగా 320 పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.