బ్రేకింగ్ః కరోనాతో కన్యాకుమారి ఎంపీ మృతి
తాజాగా కరోనాతో కన్యాకుమారి ఎంపీ మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ వసంతకుమార్ కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు కాంగ్రెస్ ఎంపీ వసంత్ కుమార్. ఈరోజు ఆరోగ్య పరిస్థితి మరీ క్షీణించడంతో..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక అందులోనూ పలువురు రాజకీయ నాయకులు వరుస పెట్టి ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉంటున్నారు. మరికొందరు కరోనా ప్రభావాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారు.
తాజాగా కరోనాతో కన్యాకుమారి ఎంపీ మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ వసంతకుమార్ కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు కాంగ్రెస్ ఎంపీ వసంత్ కుమార్. ఈరోజు ఆరోగ్య పరిస్థితి మరీ క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. వసంత్ కుమార్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వసంత కుమార్ వ్యాపారవేత్తగా పేరు పొందడమే కాకుండా, ప్రస్తుతం కన్యాకుమారి ఎంపీగా ఉన్నారు. వసంత కుమార్ మృతి పట్లు పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
H. Vasanthakumar, Congress MP from Kanyakumari, passes away. pic.twitter.com/5OPTAnEyEu
— ANI (@ANI) August 28, 2020
Also Read:
జగనన్నకి, వదినమ్మకి పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఎమ్మెల్యే రోజా
కరోనా టైంలో ఆయుర్వేదిక్ చికెన్ బిర్యానీ.. ధర ఎంతంటే?
గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్ ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు
హీరో సుధాకర్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్‌కి ఫిదా అయిన మెగాస్టార్