షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు…

తెలంగాణలో షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గురువారం మంత్రి తలసానితో సినిమా, టెలివిజన్‌ రంగ ప్రముఖులు ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, సురేష్ బాబు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు ఎలా చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెట్‌లో ఎంతమంది ఉండాలి? ఎంత సేపు షూటింగ్‌ చేయాలి? తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడారు. ఈ […]

షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు...
Follow us

|

Updated on: May 28, 2020 | 5:58 PM

తెలంగాణలో షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గురువారం మంత్రి తలసానితో సినిమా, టెలివిజన్‌ రంగ ప్రముఖులు ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, సురేష్ బాబు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు ఎలా చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెట్‌లో ఎంతమంది ఉండాలి? ఎంత సేపు షూటింగ్‌ చేయాలి? తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడారు. ఈ రోజు చలన చిత్ర పరిశ్రమ, టీవీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై సమావేశం జరిగిందన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు ఎలా ప్రారంభించాలన్న అంశంపై నిన్నా, ఈరోజు విధి విధానాలను తయారు చేశామని వెల్లడించారు. షూటింగ్‌లు పునః ప్రారంభంపై చర్చలు జరిగాయని… ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకెళ్తానని షూటింగ్‌లకు ఎప్పుడు అనుమతి ఇస్తామో తెలియజేస్తామని తెలిపారు.

బాలకృష్ణ కామెంట్స్‌పై… సినిమా పరిశ్రమ పెద్దలతో జరిగిన సమావేశాలపై వివాదం చెలరేగడంతో దానిపై మంత్రి తలసాని స్పందించారు. పరిశ్రమలో ఉన్న వారందరిని పిలవాల్సిన అవసరం లేదని.. ఎవరిని పిలువాలో.. ఎవరితో మాట్లాడాలో దానికి కొని నిబంధనలు ఉన్నాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌.

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ…

మేము అడిగిన వెంటనే ఒకసారి, అడగకపోయినా మరోసారి మాకు సాయం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారికి, సినిమా, టీవీ ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు చెబుతున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు.

ఎలా మొదలు పెట్టాలి?-నాగార్జున

ప్రభుత్వం చాలా త్వరగా స్పందించిందన్నారు అక్కినేని నాగార్జున. మాకు కావాల్సినవన్నీ చేశారు. వాళ్లు అనుమతులు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ, అంతా మా చేతుల్లోనే ఉంది. మేము క్రమశిక్షణతో, జాగ్రత్తగా సినిమా షూటింగ్స్‌ ఎలా మొదలు పెట్టాలి? అని ఆలోచించాలి. మాతోనే కాదు, ఇండస్ట్రీని అన్ని వర్గాలతో మంత్రి చర్చిస్తున్నారు అని నాగార్జు వివరించారు.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే