AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CORONAVIRUS డేంజర్ జోన్‌లో 13 నగరాలు

13 నగరాలపైనే కేంద్రం నజర్ పెట్టింది. అందులో హైదరాబాద్ కూడా వుంది. బుధవారం వరకు కేవలం 11 నగరాలే దేశంలో కరోనా విపరీతంగా ప్రబలుతున్న నగరాలు భావిస్తున్న తరుణంలో ఈ నగరాల జాబితాలోకి హైదరాబాద్ నగరం కూడా చేరింది.

CORONAVIRUS డేంజర్ జోన్‌లో 13 నగరాలు
Rajesh Sharma
|

Updated on: May 28, 2020 | 7:09 PM

Share

Thirteen cities in corona danger zone across the country: 13 నగరాలపైనే కేంద్రం నజర్ పెట్టింది. అందులో హైదరాబాద్ కూడా వుంది. బుధవారం వరకు కేవలం 11 నగరాలే దేశంలో కరోనా విపరీతంగా ప్రబలుతున్న నగరాలు భావిస్తున్న తరుణంలో ఈ నగరాల జాబితాలోకి హైదరాబాద్ నగరం కూడా చేరింది. ఒకవైపు లాక్ డౌన్ నాలుగో విడత ముగుస్తున్న తరుణంలో అయిదో విడతపై కేంద్రం దృష్టి సారించింది.

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న 13 నగరాల మున్సిపల్ కమిషనర్లతో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై సహా పలు నగరాల కమిషనర్లతో కేంద్ర కేబినెట్ సెక్రెటరీ నేరుగా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఆ 13 నగరాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబయి, దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, అహ్మదాబాద్‌, థానే, పూణె, హైదరాబాద్‌, కోల్‌కతా, ఇండోర్‌, జైపూర్‌, జోథ్‌పూర్‌, చెంగల్పట్టు, తిరువల్లూరు ఉన్నాయి. ఈ నగరాల్లో కరోనా కేసుల నియంత్రణకు అక్కడి అధికారులు చేపట్టిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కరోనా కేసుల వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపారు. కరోనా కేసుల మ్యాపింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, కరోనా రోగులు నివసిస్తున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేసుల తీవ్రతను బట్టి కాలనీలు, మునిసిపల్ వార్డులు, పోలీస్ స్టేషన్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని కేంద్ర కేబినెట్ సెక్రెటరీ సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను భౌగోళికంగా, సాంకేతికంగా గుర్తించాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో అయిదో విడత లాక్ డౌన్‌ అమలు ప్రారంభమయ్యే లోగా ఈ తంతును పూర్తి చేయాలని ఆయన మునిసిపల్ కమిషనర్లను కోరారు.

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?