యువతలో కీళ్ల నొప్పులు రావడానికి ప్రధాన కారణాలివే.. ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

November 03, 2026

Rajashekher

ఐటీ ఉద్యోగాలు, డెస్క్ జాబ్స్ కారణంగా యువత గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారు. సరైన శరీర భంగిమ లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల కీళ్ల చుట్టూ ఉండే కండరాలు బలహీనపడి మోకాళ్లు, నడుముపై ఒత్తిడి పెరుగుతుంది.

ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం:

శరీరంలో విటమిన్ డి, కాల్షియం, విటమిన్ బి12 లోపం వల్ల ఎముకలు, కండరాల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం కూడా సమస్యలకు కారణమవుతుంది.

పోషకాహార లోపాలు: 

శరీర బరువు పెరిగినప్పుడు మోకాళ్లు, తుంటి, చీలమండ కీళ్లపై అదనపు భారం పడుతుంది. దీర్ఘకాలంలో కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి దెబ్బతిని నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఊబకాయం:

జిమ్‌లో సరైన పద్ధతి పాటించకుండా బరువులు ఎత్తడం, అతిగా వ్యాయామం చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కండరాలు, లిగమెంట్లు దెబ్బతిని కీళ్ల నొప్పులు రావచ్చు.

అధిక వ్యాయామం: 

చిన్నతనంలో లేదా ఆటలు ఆడే సమయంలో మోకాళ్లు, ఇతర కీళ్లకు తగిలిన గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి గాయాలు భవిష్యత్తులో పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్‌కు కారణం కావచ్చు.

పాత గాయాలు: 

కొన్నిసార్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కీళ్లపైనే దాడి చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోసింగ్ స్పాండిలైటిస్ వంటి వ్యాధుల వల్ల చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, వాపులు రావచ్చు.

ఆటో ఇమ్యూన్ వ్యాధులు: 

కీళ్ల నొప్పులు రెండు వారాలకు మించి కొనసాగినా, వాపు, ఎరుపు, వెచ్చదనం కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. తీవ్రమైన నొప్పితో పాటు జ్వరం ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.

నిరంతర నొప్పి, వాపు:

నిద్రలేచిన తర్వాత కీళ్లు బిగుసుకుపోయి, అరగంటకుపైగా సాధారణ స్థితికి రాకపోతే జాగ్రత్తపడాలి. కీళ్ల ఆకారంలో మార్పులు, నొప్పి, అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

ఉదయం కీళ్లు బిగుసుకుపోవడం: