AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandu Master: కాళ్లలో మునుపటి బలం లేదు.. కన్నీళ్లు తెప్పిస్తోన్న పండు మాస్టర్ మాటలు.. ఎమోషనల్ వీడియో

నాలుగు నెలల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్ ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడు. తన హెల్త్ గురించి ఎప్పటికప్పుడు అప్టేట్స్ ఇస్తున్నాడు. అయితే తాజాగా తన రికవరీ గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు పండు మాస్టర్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Pandu Master: కాళ్లలో మునుపటి బలం లేదు.. కన్నీళ్లు తెప్పిస్తోన్న పండు మాస్టర్ మాటలు.. ఎమోషనల్ వీడియో
Pandu Master
Basha Shek
|

Updated on: Nov 03, 2026 | 7:04 PM

Share

ఢీ ఫేమ్, ప్రముఖ డ్యాన్సర్ పండు మాస్టర్‌ ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగు నెలల క్రితం విశాఖపట్నం జిల్లా తగరపువలసలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరై తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలో కారు ఆపి రోడ్డు పక్కన నిలబడిన పండు మాస్టర్ ను వేగంగా వచ్చిన ఒక వ్యాన్ బలంగా ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ లో పండు మాస్టర్ రెండు కాళ్లు బాగా దెబ్బ తిన్నాయి. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆపై అవసరమైన ఆపరేషన్లు కూడా పూర్తి చేశారు. డ్యాన్సే జీవితంగా బతుకుతోన్న పండు మాస్టర్ కు రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలు కావడం అందరినీ కలిచివేసింది. ప్రస్తుతం ఈ ఘోర విషాదం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. ఇంట్లోనే ఎక్సర్ సైజులు చేస్తూ రికవరీ అవుతున్నాడు. ఇదే క్రమంలో తన హెల్త్ కండిషన్ పై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాడీ డ్యాన్స్ మాస్టర్. తాజాగా తన రికవరీ జర్నీకి సంబంధించి మరో వీడియోను యూట్యూబ్‌ లో షేర్ చేశాడు పండు మాస్టర్. కాగా ఇప్పటికే మాస్టర్ రెండు కాళ్లకు పలు సర్జరీలు జరిగాయి. ఇటీవలే కుడి కాలుకు మళ్లీ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యాడు పండు.

‘ యాక్సిడెంట్ లో నా రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలోనే ఎడమ కాలికి సర్జరీ చేశాడు. ఇప్పుడు నా ఎడమ కాలు బాగుంది. కొద్ది రోజుల క్రితం కుడి కాలికి సర్జరీ జరిగింది. దీంతో ప్రస్తుతం నడవలేని పరిస్థితులలో ఉన్నాను. కుడికాలు కూడా ఎప్పటిలాగే పని చేయాలి అంటే సర్జరీ తర్వాత తనకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు డాక్టర్లు. వాటిని చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే మునపటి లాగా నా కాళ్లలో బలం లేదు. నడుస్తుంటే కాళ్లకు తిమ్మిర్లు వస్తున్నాయి. నడవడానికి, ఎక్సర్సైజ్ చేయటానికి కూడా నా కాళ్లు సపోర్ట్ చేయడం లేదు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసే సమయంలో భరించలేని నొప్పి కలుగుతోంది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు మాస్టర్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన పండు అభిమానులు కూడా బాగా ఎమోషనల్ అవుతన్నారు. పండు మాస్టర్ తొందరగా కోలుకోవాలని, మళ్లీ డ్యాన్స్ చేయాలని కోరుతూ మెసేజులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

పండు మాస్టర్ షేర్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us