రాజస్థాన్‌లో తాజాగా మరో 131 కేసులు, 6 మరణాలు
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్,ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాజస్థాన్‌లో గురువారం నాడు తాజాగా 131కేసులు నమోదయ్యాయి. ఇక నలుగురు కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,947కు చేరింది. ఈ విషయాన్ని […]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్,ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాజస్థాన్‌లో గురువారం నాడు తాజాగా 131కేసులు నమోదయ్యాయి. ఇక నలుగురు కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,947కు చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 3,202 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,566 మంది కరోనా నుంచి కోలుకోని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక గురువారం నమోదైన కేసుల్లో జల్వార్ ప్రాంతంలో 69 నమోదవ్వగా.. పాలీలో 13, భరత్పూర్‌లో 12 కేసులు నమోదయ్యాయి.