సినిమాల్లో ఇక “ఆ” సీన్లు ఉండవు..!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సర్వసాధారణం. అయితే ఇప్పుడు ఈ రొమాన్స్‌కి కాస్త బ్రేక్‌ పడింది. ముద్దులు.. మురిపాలు కాస్త తగ్గించుకోవాలంటోంది కేంద్రం. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా ఇవే సూచనలు ఇచ్చింది. ఇటీవల సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక వీటికి కూడా బ్రేక్‌ పడనుంది. లిప్‌లాక్‌తో పాటు హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకోవడం, హగ్‌ చేసుకోవడం కూడా ఇకపై కుదరదు.. […]

  • Sanjay Kasula
  • Publish Date - 5:34 pm, Thu, 28 May 20
సినిమాల్లో ఇక "ఆ" సీన్లు ఉండవు..!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సర్వసాధారణం. అయితే ఇప్పుడు ఈ రొమాన్స్‌కి కాస్త బ్రేక్‌ పడింది. ముద్దులు.. మురిపాలు కాస్త తగ్గించుకోవాలంటోంది కేంద్రం. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా ఇవే సూచనలు ఇచ్చింది. ఇటీవల సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక వీటికి కూడా బ్రేక్‌ పడనుంది. లిప్‌లాక్‌తో పాటు హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకోవడం, హగ్‌ చేసుకోవడం కూడా ఇకపై కుదరదు.. హీరో హీరోయిన్లు కాస్త దూరం నుంచే ప్రేమించుకోవాలిప్పుడు.. ముట్టుకోకుండానే ప్రేమను వ్యక్తం చేయాలి.. ఒక ఆర్టిస్ట్‌కి ఇంకో ఆర్టిస్ట్‌కి మధ్య రెండు మీటర్ల దూరం పాటించాలి. సినిమాతో పాటు టీవీ సీరియల్స్‌కి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇలాంటి అంశాలపై గురవారం జరిగిన సినీ ప్రముఖులు, తెలుగు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెళ్ల నిర్వాహకులతో తెలంగాణా హోమ్ సెక్రటరీ రవి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు.