Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవండి.. అధికారులను ఆదేశించిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ..

మరికొద్ది రోజుల్లో భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుండంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవండి.. అధికారులను ఆదేశించిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 20, 2020 | 7:52 AM

Corona Vaccination: మరికొద్ది రోజుల్లో భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుండంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు సర్వసన్నద్ధమవ్వాలంటూ జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు కీలక సూచనలు జారీ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ కోసం డిసెంబర్ 25 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర వైద్యశాఖ శాఖ ఆదేశించింది. జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ కోసం సరైన ప్రదేశాలు గుర్తించాలని సూచించిన వైద్య శాఖ.. ప్రతి వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ముందుగానే మ్యాపింగ్‌ చేసి సమీప సీహెచ్‌సీకి అనుసందానం చేయాలంది.

ఇక ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలోనూ ఐదుగురు అధికారులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలంది. ప్రతి జిల్లాలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ వైద్యులతో ఒక ప్రత్యేక కమిటీని కలెక్టర్లు నియమించడంతో పాటు ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా 10 పడకలు అందుబాటులో ఉంచుకోవాలంది. డీఐవో, డీపీఎంవో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, డీటీసీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారి, ఎలక్ట్రిసిటీ అధికారి, జిల్లా కలెక్టర్‌ నియమించిన వైద్యుల కమిటీ 24 గంటలు కంట్రోల్‌ రూమ్‌లోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా హెల్త్ కేర్ వర్కర్లతో పాటు పోలీసులు, మునిసిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఇక ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియనంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరపాలని సూచించింది.

Also read:

New Bacteria in Kerala: హడలెత్తిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. కేరళలో బాలుడు మృతి.. జాగ్రత్త అంటూ వైద్యుల వార్నింగ్..!

తస్మాత్ జాగ్రత్త… మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా… చైనా సైబర్ దాడి… ఆఫర్ల పేరుతో మోసం…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!