Covid-19 Variant: దక్షిణాఫ్రికా కరోనా స్ట్రేయిన్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన అన్నాచెల్లెలిద్దరికీ పాజిటివ్..
South African Covid-19 Variant: దేశంలో కరోనావైరస్ ఉధృతి ఇప్పటికే వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో ఆందోళన
South African Covid-19 Variant: దేశంలో కరోనావైరస్ ఉధృతి ఇప్పటికే వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. దీంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు సైతం విధించారు. ఈ క్రమంలోనే దేశంలో కొత్తరకం కరోనా కేసులు కూడా ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా అన్న చెల్లెలిద్దరికీ సౌత్ ఆఫ్రికా కరోనా వేరియంట్ పాజిటివ్‌గా గుర్తించారు. వారిద్దరూ ఇటీవల దుబాయి నుంచి కర్ణాటకలోని బళ్లారికి వచ్చారు. కర్ణాటక శివమొగ్గకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారించారు. ఆ వ్యక్తికి సోకిన అనంతరం అన్నా చెల్లెలిద్దరూ మహమ్మారి బారిన పడ్డారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 17న వారిద్దరూ దుబాయ్ నుంచి బళ్లారికి వచ్చారని అధికారులు తెలిపారు. అనంతరం అన్నాచెల్లెలిద్దరూ అనారోగ్యానికి గురవడంతో.. మూడు రోజలు తర్వాత కరోనా పరీక్షలు చేయించుకున్నారు. బెంగళూరు వైద్యులు ఈ పరీక్షలను పరిశీలించగా.. వారికి దక్షిణాఫ్రికా వేరియంట్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిద్దరూ బళ్లారిలోని ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. ప్రయాణానికి ముందూ వారిద్దరూ దుబాయ్ విమానాశ్రయంలో పరీక్షలు చేయించుకున్నారు. వారికి అక్కడ నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దేశానికి వచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాత.. జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకున్నారు. వారి వివరాలను పరిశీలించిన అనంతరం అధికారులు వారి రిపోర్టులను బెంగళూరుకు రిఫర్ చేశారు. దక్షిణాఫ్రికా వేరియంట్ పాజిటివ్‌గా గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తరకం కరోనా ఉధృతి పెరగకుండా అధికారులు పలు చర్యలు ప్రారంభించారు.
Also Read: