దేశంలో కొత్త స్ట్రెయిన్ల కలకలం.. 5 రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న కేసులు.. వేగంగా క్షీణిస్తున్న రోగుల ఆరోగ్యం

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రాకతో విముక్తి కలుగుతుందనుకుంటే, మరోసారి మహారాష్ట్రకు ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు.

దేశంలో కొత్త స్ట్రెయిన్ల కలకలం.. 5 రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న కేసులు.. వేగంగా క్షీణిస్తున్న రోగుల ఆరోగ్యం
Follow us

|

Updated on: Feb 22, 2021 | 10:17 AM

New Indian Strains : నిర్లక్ష్యం.. అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యాక్సిన్‌ వచ్చేసేంది మనకు ఏమి కాదు అన్న నిర్లక్ష్యం.. కాని కరోనా ప్లీజ్‌ తోడా డరోనా అంటే ఎవరు వినిపించుకోవడం లేదు..తప్పదు ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అంటు వార్నింగ్‌ ఇస్తున్నాయి ప్రభుత్వాలు..

ఇంతకాలం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రాకతో విముక్తి కలుగుతుందనుకుంటే, మళ్లీ అదే సీన్.. మరోసారి మహారాష్ట్రకు ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. ఈ రాష్ట్రంలో పుట్టుకొచ్చిన రెండు కొత్త స్ట్రెయిన్లు దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్న మొన్నటివరకు యూకే కొత్త స్ట్రెయిన్‌తో గజగజ వణికిపోయాం. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌తోనూ ఆందోళనకు గురయ్యాం. ఇప్పుడు మహారాష్ట్రలో పుట్టుకొచ్చిన రెండు కొత్త కరోనా వేరియంట్లతో వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతోంది.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైందని చాలా రోజుల నుంచి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అనుకున్నదే జరుగుతోంది. కోవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాదాపు ఐదు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి కేసులు పెరుగుతున్న తీరును చూస్తూంటే అదే అనిపిస్తుంది. ఇది సెకండే వేవ్‌కి సంకేతం అంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మెల్ల మెల్లగా కేసుల సంఖ్య పెరుగుతుంది.

కరోనా ఇంకా పోలేదు.. మాస్క్‌ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండని ప్రభుత్వం, అధికారులు, వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. 2021 ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చిన వైరస్‌.. ఇప్పుడు మళ్లీ తీవ్రత పెంచింది. గత వారం రోజుల నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో కేసులు ఘననీయంగా పెరుగుతున్నాయి. వైరస్‌ ఉధృతి పెరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.

ఇక, మహారాష్ట్ర విషయానికికొస్తే పరిస్థితి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. మరోసారి కొత్తగా కొవిడ్‌ కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో రికార్డయ్యాయి. అయా ప్రాంతాలను కంటెన్మెంట్ జోస్లుగా మార్చిన అధికారులు, అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని ముంబై కార్పొరేషన్ మేయర్‌ హెచ్చరించారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని అమరావతి డివిజన్‌లో వారంపాటు లాక్‌డౌన్‌ విధించారు.. మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్‌ అత్యంత ప్రమాదకరంగా మారిందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. శరీరంలో యాంటీబాడీలు ఉన్నప్పటికీ ఈ కొత్త స్ట్రెయిన్‌ వల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకడం ఆందోళన పుట్టిస్తోంది..

ఇక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా పుణెలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అన్ని పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్త నిబంధనలను విడుదల చేస్తామని పుణె డివిజనల్ కమిషనర్ చెప్పారు.

అటు తెలుగు రాష్ట్రాల్లోను సెకండ్‌ వేవ్‌ మళ్లీ భయపెడుతోంది..కరోనా కేసులు తగ్గాయని అనుకునే లోపే కలవరానికి గురిచేసే ఘటన.! వైరస్‌ ఇంకా కనుమరుగు కాలేదనే హెచ్చరిక.! ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 33 కేసులు ఒక్క కరీంనగర్‌ జిల్లాలో నమోదైయ్యాయి.. దీంతో కరోనా మళ్లీ విజృభిస్తోందని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా రూల్స్‌ పాటించాలంటున్నారు..

కరోనాని పూర్తిగా నిర్మూలించాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని విశ్వసిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వ్యాక్సినేషన్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వారంలో కనీసం నాలుగు రోజులు టీకా డోసులు ఇచ్చే కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. వచ్చే నెలకల్లా 50 ఏళ్లకు పైబడిన సీనియర్‌ సిటిజన్లకి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని పేర్కొన్నారు.

కరోనా నిబంధనలను ప్రజలకు గాలికి వదిలేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వాలు అంటున్నాయి.. మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం వంటి విషయాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..ఒకవేళ ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి మరింత దిగజారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also…  మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా ? మెరుగైన జ్ఞాపకశక్తి కోసం వీటిని తినాలంటున్న నిపుణులు..

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.