Corona: కరోనా మళ్లీ విజృంభిస్తుండడానికి కారణం అదే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిపుణులు..
Reasons For Increasing Corona Cases: గతేడాది మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుతోందని అందరూ భావిస్తోన్న సమయంలో దేశంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతోంది...
Reasons For Increasing Corona Cases: గతేడాది మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుతోందని అందరూ భావిస్తోన్న సమయంలో దేశంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతోంది. మరీ ముఖ్యంగా మహారాష్ర్టతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో పుణెతో పాటు కొన్ని నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు వైద్యులకు సవాలు విసురుతోంది. ఇక ఒక్క మహారాష్ట్రాలోనే వైరస్‌లో కొత్త జన్యు పరివర్తనాలను వైద్యులు గుర్తించడం గమనార్హం. మహారాష్ట్రాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరగడానికి కొత్త కరోనా వైరస్ కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉందని, ఇది మరింత ప్రమాదకారి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దేశంలో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించలేదని వైద్యులు చెబుతున్నారు. దేశ జనాభాలో 80 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని చెబుతున్నారు. సెకండ్ వేవ్‌ను కంట్రోల్ చేయాలంటే కోవిడ్ -19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వ్యాక్సినేషన్ చేసుకున్న వ్యక్తి, యాంటీబాడీస్ వృద్ధి చెందినవారికి సైతం కొత్త రకం వైరస్ మరోసారి ఇన్‌ఫెక్షన్ కలిగించే ప్రమాదం ఉందని.. గతేడాది లాగే టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఇసోలేషన్ పునఃప్రారంభించాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరూ మొదట్లోలాగే తూచా తప్పకుండా కోవిడ్ -19 జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.