నారాయణస్వామి నెగ్గుతారా.. ఓడుతారా.. పుదుచ్చేరిలో బలపరీక్షపై కొనసాగుతున్న ఉత్కంఠ

Puducherry floor test : పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌‌లో చోటుచేసుకున్న సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. అసెంబ్లీ‌లో బలపరీక్షకు ఒక్క రోజు ముందే కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

నారాయణస్వామి నెగ్గుతారా.. ఓడుతారా.. పుదుచ్చేరిలో బలపరీక్షపై కొనసాగుతున్న ఉత్కంఠ
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 22, 2021 | 9:34 AM

Puducherry politics : పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌‌లో చోటుచేసుకున్న సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. అసెంబ్లీ‌లో బలపరీక్షకు ఒక్క రోజు ముందే కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ.. సీనియర్ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన లక్ష్మీనారాయణ్ తన పదవికి రాజీనామా చేశారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేశ్ కూడా ఆ పార్టీ గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి బలం 12కు పడిపోయింది. ఇక, ముఖ్యమంత్రి నారాయణస్వామికి బలపరీక్ష నిజంగానే పెద్ద పరీక్షలా మారింది. దీంతో అసెంబ్లీలో ఇవాళ సాయంత్ర జరగబోయే బలపరీక్షను నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

పుద్చుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలున్న కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థిని కలుపుని 18 మంది సభ్యుల మద్దతుతో నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, గత నెల రోజులుగా పుదుచ్చేరి కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మొత్తం నలుగురు కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ బలం 14కు చేరింది. అందులో కాంగ్రెస్‌ 10, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు ఉన్నారు. అయితే కాంగ్రెస్‌కు తగినంత మద్దతు లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

ఈ నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన తమిళి సై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నారాయణ స్వామి ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు పుదుచ్చేరి అసెంబ్లీ‌లో బలాన్ని నిరూపించుకోవాలని తెలిపారు. అయితే, బలపరీక్షకు ముందు రోజు పుదుచ్చేరిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సభలో కాంగ్రెస్ కూటమి బలం 12కి పడిపోయింది. మరోవైపు నారాయణస్వామి కాంగ్రెస్‌-7, అన్నాడీఎంకే-4, బీజేపీ-3(నామినేటెడ్‌) సభ్యులకు కలుపుకుంటే వారికి బలం 14గా ఉంది.

ఇక, పుదుచ్చేరిలో పరిణామాలపై స్పందించిన సీఎం నారాయణ స్వామి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేయడమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు.

Read Also…. దేశవ్యాప్తంగా ఉధృతమవుతున్న రైతుల ఆందోళన.. 23న పగాడీ సంభాల్‌ దివస్, 24న దామన్‌ విరోధి దివస్‌‌కు పిలుపు