మహారాష్ట్రలో మళ్లీ కరోనా కలవరం.. పౌరసరఫరాల శాఖ మంత్రికి పాజిటివ్.. ఏడుకు చేరిన మంత్రుల సంఖ్య..!
ఇన్నాళ్లుగా తక్కువగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరగుతుంది. తాజాగా ఆ రాష్ట్ర మరో మంత్రికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
Chhagan bhujbal corona : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి వికృత రూపం దాల్చుతోంది. ఇన్నాళ్లుగా తక్కువగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరగుతుంది. తాజాగా ఆ రాష్ట్ర మరో మంత్రికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నదని, పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నానని చెప్పారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, మంత్రులు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.
माझी कोरोना टेस्ट पॉझिटिव्ह आली आहे. गेल्या दोन तीन दिवसात माझ्या संपर्कात अलेल्या सर्वांनी आपली कोरोना टेस्ट करून घ्यावी.माझी प्रकृती उत्तम असून काळजी करण्याचे कारण नाही.कोरोनाच्या पार्श्वभूमीवर सर्व नागरिकांनी योग्य ती काळजी घ्यावी.मास्क,सॅनिटायझर चा नियमित वापर करा.#COVID19
— Chhagan Bhujbal (@ChhaganCBhujbal) February 22, 2021
కాగా, ఛగన్ భుజ్‌బల్‌తో కలిసి ఈ నెల మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బారిన పడిన మంత్రుల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే అనిల్ దేశ్‌ముఖ్, రాజేంద్ర షింగ్నే, జయంత్ పాటిల్, రాజేశ్ తోపే, సతేజ్ పాటిల్, బచ్చు కదూ కరోనా బారినపడ్డారు. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా రెండు విడత కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ముంబై మహానగరంలో పలు భవనాలను కంటెన్మెంట్ జోన్లగా ప్రకటించిన బీఎంసీ కోవిడ్ అంక్షలు అమలు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారిపట్ల అంక్షలు అమలు చేస్తోంది.
Read Also… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం.. ఇంటి ముందు నిల్చున్న బాలికను లాక్కెళ్లి అఘాయిత్యం..!