మతం మార్చుకున్నాడు.. మర్కజ్ వెళ్లాడు.. ఇప్పుడు ఇలా..
సరిగ్గా ఆరు మాసాల క్రితం యూపీకి చెందిన ఓ యువకుడు మతం మార్చుకున్నాడు. అతడు ఉన్న మతం నుంచి ఇస్లాంని స్వీకరించి ముస్లింగా మారాడు. అతనిది యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లా దుధారా పీఎస్ ప్రాంతం. అయితే మతం మార్చుకున్న నేపథ్యంలో.. అతడిని అక్కడి ముస్లిం మతపెద్దలు.. గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన సమావేశాలకు తీసుకెళ్లారు. అయితే అక్కడ జరిగిన తబ్లీఘీ సమావేశాల నుంచి తిరిగి వచ్చాక.. అతనికి వైద్య పరీక్షలు చేయడంతో.. […]

సరిగ్గా ఆరు మాసాల క్రితం యూపీకి చెందిన ఓ యువకుడు మతం మార్చుకున్నాడు. అతడు ఉన్న మతం నుంచి ఇస్లాంని స్వీకరించి ముస్లింగా మారాడు. అతనిది యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లా దుధారా పీఎస్ ప్రాంతం. అయితే మతం మార్చుకున్న నేపథ్యంలో.. అతడిని అక్కడి ముస్లిం మతపెద్దలు.. గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన సమావేశాలకు తీసుకెళ్లారు. అయితే అక్కడ జరిగిన తబ్లీఘీ సమావేశాల నుంచి తిరిగి వచ్చాక.. అతనికి వైద్య పరీక్షలు చేయడంతో.. అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆ యువకుడిని సీతాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ క్రమంలో సదరు యువకుడి కాంటాక్ట్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ యువకుడు ఇంకా ఎవరెవర్ని కలిశాడన్నదాని గురించి తెలుసుకుంటుండగా.. సదరు యువకుడు ఆర్నెళ్ల క్రితం ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లింగా మారాడని తేలింది.