కోవిడ్‌తో ప్రముఖ సినీ నిర్మాత మృతి
తమిళనాట సంచలన సినిమాలు నిర్మిచిన వి స్వామి నాథన్ కరోనాతో మరణించారు. ఇటీవలే ఆయనకు కోవిడ్ సోకింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సోమవారం ఆయన కన్నుమూశారు. స్వామి నాథన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు..
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతో మంది రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులను కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. ఇక అందులోనూ దేశ వ్యాప్తంగా కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులతో ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానానికి చేరుకుంది భారత్. ఇక ఇండియా వ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రముఖులు కన్నుమూశారు. ఇండస్ట్రీలో కూడా ఈ మరణాలు తప్పట్లేదు. తాజాగా మరో ప్రముఖ నిర్మాత మృతి చెందారు.
తమిళనాట సంచలన సినిమాలు నిర్మిచిన వి స్వామి నాథన్ కరోనాతో మరణించారు. ఇటీవలే ఆయనకు కోవిడ్ సోకింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సోమవారం ఆయన కన్నుమూశారు. స్వామి నాథన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా తమిళ చిత్ర పరిశ్రమలో ఈయనది దాదాపు పాతికేళ్ల ప్రస్థానం. తమిళనాట ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన లక్ష్మీ మూవీ మేకర్స్ భాగస్వాముల్లో స్వామి నాథన్ కూడా ఒకరు. ఈయనతో పాటు ఆ నిర్మాణ సంస్థలో కే మురళీధరన్, వేణుగోపాల్ ఉన్నారు. ఈ సంస్థ ద్వారా ‘అరణ్ మనై కావలన్’ అనే చిత్రాన్ని తొలిసారిగా 1994లో నిర్మించారు.
Read More: కడప సెంట్రల్ జైలులో కోవిడ్ కలకలం