‘ఆత్మ నిర్బర్‌ భారత్‌’ పథకం కింద.. ఏపీకి తొలి విడతగా రూ.6,540 కోట్లు..?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మ నిర్బర్‌ భారత్‌’ పథకం కింద ప్రకటించిన రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక వసతుల నిధిలో ఆంధ్రప్రదేశ్‌కు తొలి విడతగా రూ.6,450 కోట్లు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇవి తాత్కాలిక

‘ఆత్మ నిర్బర్‌ భారత్‌’ పథకం కింద.. ఏపీకి తొలి విడతగా రూ.6,540 కోట్లు..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 11, 2020 | 1:47 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మ నిర్బర్‌ భారత్‌’ పథకం కింద ప్రకటించిన రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక వసతుల నిధిలో ఆంధ్రప్రదేశ్‌కు తొలి విడతగా రూ.6,450 కోట్లు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇవి తాత్కాలిక కేటాయింపులు మాత్రమే. ఈ పథకం 2020–21 నుంచి 2029–30 వరకు అంటే పదేళ్లు అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు నిధులు మంజూరవుతాయని అంచనా. తిరిగి చెల్లింపుల కోసం.. మారటోరియం గడువు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. గరిష్టంగా రూ.2కోట్ల వరకు రుణాలు ఇస్తారు. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కాల పరిమితి 7 ఏళ్లు.

ఈ పథకానికి ఎవరు అర్హులంటే.. రైతులు, అగ్రీ పారిశ్రామిక వేత్తలు, పీఏసీఎస్, మార్కెటింగ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలు, ఎంఎసీలు, స్టార్టప్స్, పీపీపీ ప్రాయోజిత పథకాలు.. వీరంతా సాయం పొందొచ్చు. ఈ పథకంలో పాల్గొనదలచిన ఆర్థిక సంస్థలు నాబార్డ్, డీఏసీఎఫ్‌డబ్ల్యూ తో ఒప్పందం కుదుర్చుకోవాలి. ప్రతిపాదిత పథకం అమలు బాధ్యతను జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నియంత్రణ సంఘాలు చూస్తాయి. ఇతర వివరాలకు నాబార్డ్‌ లేదా వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించవచ్చు.

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు