AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్తి కోసం తల్లిపై దాడి చేసిన ఉపాధ్యాయుడు

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. అస్తి కోసం రక్త సంబంధీకులనే కాదనుకుంటున్నారు. చిన్న కొడుకుకి దక్కాల్సిన భూమి వాటాపై ప్రశ్నినందుకు కన్న తల్లినే చితకబాదాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం సీతారాంపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది.

Balaraju Goud
|

Updated on: Aug 11, 2020 | 1:34 PM

Share

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. అస్తి కోసం రక్త సంబంధీకులనే కాదనుకుంటున్నారు. చిన్న కొడుకుకి దక్కాల్సిన భూమి వాటాపై ప్రశ్నినందుకు కన్న తల్లినే చితకబాదాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం సీతారాంపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది.

సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన నల్లెల సూరయ్య, సుశీలకు ముగ్గురు సంతానం. వారికి ఉన్న 7.28 ఎకరాల భూమిలో కూతురుకు ఎకరం రాసిచ్చారు. తల్లి సుశీల పేరుపై ఎకరం ఉంది. మిగిలిన భూమిని ఇద్దరు కుమారులు సమానంగా పంచుకోవాల్సి ఉండగా పెద్ద కుమారుడు నల్లెల రవీందర్‌ ఎక్కువ తీసుకున్నాడు. దీంతో చిన్న కుమారుడైన శ్రీధర్‌ తన వాటాకు రావాల్సిన మిగతా భూమి కోసం అన్నతో గొడవకు దిగాడు. అయితే, చిన్న కుమారుడికి అన్యాయం జరిగిందని గ్రహించిన తల్లి సుశీల అతనికి అండగా నిలిచింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న రవీందర్‌ పత్తి చేను వద్ద పనిచేస్తున్న తల్లిపై భార్యతో కలిసి దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో వృద్ధురాలి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్న కుమారుడు శ్రీధర్‌ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. కాగా, దాడికి సంబంధించిన వీడియోతో పరకాల ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలితోపాటు శ్రీధర్‌ తెలిపారు. తల్లిపై దాడికి పాల్పడ్డ రవీందర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?

సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..

ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..

పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా

ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల

టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ

ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!

నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్

తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు

అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం