కడప సెంట్రల్ జైలులో కోవిడ్ కలకలం
తాజాగా కడప సెంట్రల్ జైలులో కరోనా కలకలం సృష్టించింది. జైల్లోని ఖైదీల్లో 19 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వైరస్ సోకిన 19 మందిని ఫాతిమ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే జైలులో పూర్తిగా శానిటైజ్..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో రోజుకి వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈ మహమ్మారి ఎటాక్ చేస్తూనే ఉంటోంది. బయటనే కాకుండా జైలులో కూడా ఇది తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తోంది.
తాజాగా కడప సెంట్రల్ జైలులో కరోనా కలకలం సృష్టించింది. జైల్లోని ఖైదీల్లో 19 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వైరస్ సోకిన 19 మందిని ఫాతిమ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే జైలులో పూర్తిగా శానిటైజ్ చేశారు. వైరస్ సోకిన 19 మంది ఖైదీలతో, రెండు, మూడు రోజులుగా ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వారి వివరాలను కూడా సేకరించి టెస్టులు నిర్వహిస్తున్నారు సెంట్రల్ జైలు అధికారులు. కాగా ప్రస్తుతం కడపలో కూడా విపరీతంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా 14,061 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 148 మంది మృతి చెందారు.