గుడ్ న్యూస్.. ఇంటర్ విద్యార్ధులకు ఆన్‌లైన్‌ పాఠాలు..!

కరోనా వైరస్ కారణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మహమ్మారికి స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష కావడంతో.. అధికారులు ఆన్‌లైన్‌ పాఠాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్ధులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందించాలని ఇంటర్ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీని కోసం ప్రభుత్వ ఛానల్ టీశాట్, ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానల్ తదితర వాటిని వినియోగించుకోవాలని కమిషనర్ జలీల్ భావిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన […]

  • Ravi Kiran
  • Publish Date - 7:42 am, Wed, 27 May 20
గుడ్ న్యూస్.. ఇంటర్ విద్యార్ధులకు ఆన్‌లైన్‌ పాఠాలు..!

కరోనా వైరస్ కారణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మహమ్మారికి స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష కావడంతో.. అధికారులు ఆన్‌లైన్‌ పాఠాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్ధులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందించాలని ఇంటర్ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీని కోసం ప్రభుత్వ ఛానల్ టీశాట్, ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానల్ తదితర వాటిని వినియోగించుకోవాలని కమిషనర్ జలీల్ భావిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌తో బుధవారం జరిగే సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు.

అటు ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి, కళాశాలల పునః ప్రారంభంపై కూడా ఆమె సమీక్షించనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఇంటర్ ప్రధమ, ద్వితీయ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కానున్న నేపధ్యంలో జూన్ రెండో వారంలో ఇంటర్ మొదట, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కళాశాలల పునః ప్రారంభం విషయమై ఇంటర్ బోర్డు అధికారులు, ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు శేషుకుమారి, పాఠశాల విద్యాశాఖ మాజీ అదనపు సంచాలకుడు గోపాల్ రెడ్డి తదితరులతో నియమించిన కమిటీ ఈ నెల 30వ తేదీ లోపు నివేదిక అందించనుంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ఆగష్టు మొదటి వారంలో, అలాగే రెండో సంవత్సరం క్లాసులు జూలైలో ప్రారంభించే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.