AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్చువల్‌ మహానాడు…అంతా ‘జూమ్‌’ లోనే…

మహానాడు.. టీడీపీకి పెద్ద పండుగ ఇది. ఏటా రెండు మూడు రోజులపాటు అత్యంతకోలాహలంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి దృష్ట్యా... ఈసారి మహానాడును ఈసారి రెండు రోజులకే కుదించారు.

వర్చువల్‌ మహానాడు...అంతా ‘జూమ్‌’ లోనే...
Sanjay Kasula
|

Updated on: May 27, 2020 | 12:44 PM

Share

మహానాడు.. టీడీపీకి పెద్ద పండుగ ఇది. ఏటా రెండు మూడు రోజులపాటు అత్యంతకోలాహలంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి దృష్ట్యా… ఈసారి మహానాడును రెండు రోజులకే కుదించారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా ‘వర్చువల్‌ మహానాడు’ జరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్‌ యాప్‌ ద్వారా ఇందులో పాల్గొంటున్నారు.

యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని చూసేలా ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీ… ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్‌లైన్‌లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి.

మే 28న ఎన్టీఆర్‌ జయంతి కలసి వచ్చేలా, ఏటా మూడు రోజులపాటు అత్యంత కోలాహలంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. కరోనా వల్ల ఈసారి… పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి ఇళ్ల నుంచే మహానాడులో పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభాగం అధ్యక్షుడు కళావెంకటరావు సహా, కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు మాత్రం మంగళగిరి సమీపంలోని పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ‘మహానాడు’లో పాల్గొంటారు. మిగిలిన నేతలంతా జూమ్‌ యాప్‌ ద్వారా భాగస్వాములవుతారు.

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం