AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..

Telangana: డిమాండ్‌ల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా శుక్రవారం జరిగే విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని..

Telangana: జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
Telangana Educational Institutions Bandh
Subhash Goud
|

Updated on: Jul 23, 2026 | 6:00 AM

Share

Telangana: తెలంగాణలో జూలై 24న శుక్రవారం విద్యాసంస్థలు బంద్‌ ఉండనున్నాయి. విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలంగాణలోని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ బంద్‌కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.

శుక్రవారం తెలంగాణలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఇందులో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌,ఎన్‌ఎస్‌యూఐ, పీఎస్‌డీయూ, ఏఐఎఫ్‌డీఎస్‌ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి.

విద్యావ్యవస్థ నాశనమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్‌ అని వారన్నారు. తర్వాత పరీక్షలు సరిగా నిర్వహించకుండా ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన NTAను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని నినదించారు.

ఈ డిమాండ్‌ల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా శుక్రవారం జరిగే విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?