Covid Vaccination: ఇకపై వాట్సాప్‌లో కోవిడ్ వ్యాక్సినేన్‌షన్ సర్టిఫికేట్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.
Covid Vaccination Certificate: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిపై ఇప్పుడు వ్యాక్సినేషన్ రూపంలో యుద్ధం జరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ ప్రక్రియను...

Covid Vaccination Certificate: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిపై ఇప్పుడు వ్యాక్సినేషన్ రూపంలో యుద్ధం జరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపడుతూ కరోనాను తరిమికొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ ఇందులో ముందు వరుసలో దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 80 కోట్లకు పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. రోజురోజుకీ వ్యాక్సిన్ డోసుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు.
ఇక వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత ముఖ్యంగా మారిందో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా అంతే ప్రధానంగామారింది. దేవాలయాల నుంచి ప్రయాణాల వరకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను అడిగే రోజులు వచ్చేశాయి. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కావాలంటే కోవిన్ పోర్టల్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలని మనకు తెలుసు. అయితే ఇది కాస్త కష్టంతో కూడుకున్న విషయం. పెద్దగా ఇంటర్‌నెట్‌పై అవగాహన లేని వారికి ఇబ్బందిగా మారుతోంది. ఇందు కోసమే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఓ అవకాశాన్ని తీసుకొచ్చారు.
Revolutionising common man’s life using technology!
Now get #COVID19 vaccination certificate through MyGov Corona Helpdesk in 3 easy steps.
? Save contact number: +91 9013151515 ? Type & send ‘covid certificate’ on WhatsApp ? Enter OTP
Get your certificate in seconds.
— Office of Mansukh Mandaviya (@OfficeOf_MM) August 8, 2021
ఇకపై వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను వాట్సాప్ ద్వారా చాలా సింపుల్ స్టెప్స్‌తో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కలిపించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలే తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
* ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో 9013151515 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. * అనంతరం కోవిడ్ సర్టిఫికేట్ అని టైప్ చేసి పైన తెలిపిన నెంబర్‌కు వాట్సాప్ చేయాలి. * ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. * చివరిగా మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
Covid News: దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా..? CSIR నిపుణులు ఏమని తేల్చారో తెలుసా..
Andhra Pradesh: రావాలమ్మా రావాలి.. కరోనా వ్యాక్సిన్.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వేయించుకోండమ్మా..