తెలంగాణ నుంచి వెళ్లాలనుకునే వారికి ..ఆన్‌లైన్‌లో ఈ-పాస్
now you can apply for e-pass in online if you want go beyond telangana state

ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా… తెలంగాణలో ఉండిపోయి… తమ రాష్ట్రాలకు వెళ్లలేకపోతే… ఇప్పుడు వారు… ఈ-పాస్ (E-PASS) కోసం అప్లై లో చేసుకోవచ్చని రాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించింది. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ-పాస్ సైట్ (https://tsp.koopid.ai/epass)లోకి వెళ్లి చూడవచ్చన్నారు. అలాగే… ఈ-పాస్ కోసం సైట్‌లోనే అప్లై చేసుకోవచ్చని తెలిపారు. అప్లై చేసుకోవడానికి కొంత సమాచారం ఎంటర్ చెయ్యాల్సి ఉంటుందన్న పోలీసులు… అలా వచ్చిన దరఖాస్తులను తాము పరిశీలించి… అంతా సక్రమంగా ఉంటే… ఈ-పాస్ జారీ చేస్తామని చెప్పారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ వీలైనంత త్వరగా ఈ-పాస్‌లు జారీచేస్తున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. ఒక్కరోజులోనే 12వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వీరిలో 7,749 మందికి ఈ-పాస్‌లు జారీచేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌కు ఒక్కరోజులోనే లక్షా20వేల హిట్స్ వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.