AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Plus variant: అలా అయితేనే.. డెల్టా ప్లస్ వేరియంట్‌ను అరికట్టగలం: ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా

AIIMS chief Randeep Guleria: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కరోనా వేరియంట్స్ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో

Delta Plus variant: అలా అయితేనే.. డెల్టా ప్లస్ వేరియంట్‌ను అరికట్టగలం: ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా
Randeep Guleria
Shaik Madar Saheb
|

Updated on: Jul 01, 2021 | 4:23 PM

Share

AIIMS chief Randeep Guleria: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కరోనా వేరియంట్స్, థర్డ్ వేవ్ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ వేవ్‌కు ఆస్కారం లేదని పేర్కొన్నారు. దీంతోపాటు కోవిడ్-19లోని డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమని తెలియజేసే సమాచారం అంతగా అందుబాటులో లేదని డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని కానీ.. దీనివల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తాయని కానీ చెప్పడానికి తగినన్నీ ఆధారాలు స్పష్టంగా లేవని పేర్కొన్నారు. అయితే.. ఈ వేరియంట్లకు చెక్ పెట్టేందుకు ప్రజలు కోవిడ్-19 మార్గదర్శకాలను సక్రమంగా పాటించాలని సూచించారు. దీంతోపాటు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే కొత్తగా వచ్చే వేరియంట్ల నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు డాక్టర్ గులేరియా గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.

డెల్టా ప్లస్ వేరియంట్‌పై పెద్దగా సమాచారం లేదన్నారు. ఇది ఎక్కువ వేగంతో వ్యాపించగలదని లేదా ఎక్కువ మంది మరణిస్తారన్న దానిపై వివరాలు లేవన్నారు. దీంతోపాటు రోగ నిరోధక వ్యవస్థ నుంచి ఈ వేరియంట్ తప్పించుకోగలుగుతుందని చెప్పడానికి తగిన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ, వ్యాక్సిన్ వేయించుకుంటే, రాబోయే వేరియంట్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ధీమా వ్యక్తంచేశారు. డాక్టర్స్ డే సందర్భంగా.. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ వర్కర్లను గులేరియా గుర్తు చేసుకున్నారు. గడచిన సంవత్సరం నుంచి డాక్టర్లు ఎంతో పోరాడుతున్నారని, వారి కృషిని అందరూ ప్రశంసించాలని.. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినవారిని స్మరించుకోవాలని కోరారు. అందరూ కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ, వ్యాక్సిన్ తీసుకోవాలని తద్వారా డాక్టర్లపై ఒత్తిడిని తగ్గించాలని కోరారు.

Also Read:

ZYDUS CADILA: భారతీయులకు మరో గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్‌లోకి జైకోవ్- డీ వ్యాక్సిన్..

WhatsApp New Feature: మరో కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌.. ఇకపై మీరు పంపిన డేటాను ఒకేసారి కనిపించేలా చేయొచ్చు.