లాక్‌డౌన్ ఎఫెక్ట్.. శ్రీవారి దర్శనం మే 3 తర్వాతే..
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తుండటంతో.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుందని.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలిపారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రభావంతో తిరుమల శ్రీవారి దర్శనలకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. మే3వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిని నిరాకరిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేవలం తిరుమల శ్రీవారి దర్శనాలే […]

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తుండటంతో.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుందని.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలిపారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రభావంతో తిరుమల శ్రీవారి దర్శనలకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. మే3వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిని నిరాకరిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
కేవలం తిరుమల శ్రీవారి దర్శనాలే కాదు.. టీటీడీ అనుబంధంగా ఉన్న ఆలయాలన్నింటిలో కూడా భక్తులకు దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. ఇక తిరుపతిలో ప్రతి రోజు.. ఒక లక్షా 30 వేల అన్నప్రసాద ప్యాకెట్లను ప్రజలకు వితరణ చేస్తున్నట్లు అశోక్ సింఘాల్ తెలిపారు. అంతేకాదు.. రాష్ట్రంలోని 13 జిల్లాలకు అన్నప్రసాద్ ట్రస్ట్ తరఫున జిల్లాకు రూ. కోటి చొప్పున నిధులు కేటాయిస్తున్నామన్నారు.



