సెలూన్స్‌కు వెళుతున్నారా.. ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే…

లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో 56 రోజులుగా ఇంటికే పరిమితమైన జనం.. ఒక్కొక్కరిగా రోడ్లమీదకు వస్తున్నారు. అయితే అత్యవసర పనుల మీద బయటికి వచ్చేవారందరూ తప్పకుండా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే కంటైన్మెంట్ జోన్లు తప్పితే.. మిగిలిన ప్రదేశాల్లో సెలూన్లు, కటింగ్ షాపులు తెరుచుకోవడంతో ప్రజలు ఎక్కువగానే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం […]

సెలూన్స్‌కు వెళుతున్నారా.. ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే...
Follow us

|

Updated on: May 22, 2020 | 12:10 AM

లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో 56 రోజులుగా ఇంటికే పరిమితమైన జనం.. ఒక్కొక్కరిగా రోడ్లమీదకు వస్తున్నారు. అయితే అత్యవసర పనుల మీద బయటికి వచ్చేవారందరూ తప్పకుండా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే కంటైన్మెంట్ జోన్లు తప్పితే.. మిగిలిన ప్రదేశాల్లో సెలూన్లు, కటింగ్ షాపులు తెరుచుకోవడంతో ప్రజలు ఎక్కువగానే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

సెలూన్ షాపులను రెండు భాగాలుగా విభజించిన ప్రభుత్వం.. ఎక్కువ ధర చెల్లించే సెలూన్లకు వెళ్లేవారు ఖచ్చితంగా తమతో ఇంటి దగ్గర నుంచి టవల్ తీసుకెళ్లాలని సూచించింది. అంతేకాక అక్కడ పనిచేసే సిబ్బంది పీపీఈలను వాడాలని.. చేతికి గ్లౌజులు ఉపయోగించాలని తెలిపింది. ఇక షాపుకు వచ్చే కస్టమర్లు అందరూ కూడా మాస్క్ ధరించాలి. వారి వివరాలను సిబ్బంది ప్రతీ రోజూ తప్పనిసరిగా నోట్ చేసుకోవాలంది. కుర్చీలను శానిటైజ్ చేయడంతో పాటు.. షాపు చుట్టూ సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయాలని తెలిపింది.

మరోవైపు చిన్న షాపులు కూడా ఇదే విధంగా కొన్ని నిబంధనలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది. కస్టమర్లు వారి టవల్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలని.. ప్రతీ రోజూ షాపు యజమాని కస్టమర్ల పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. అలాగే  సిబ్బంది గ్లౌజులు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలంది. అటు ఒకరికి వాడిన రేజర్‌ను మరొకరికి వాడకూడదని స్పష్టం చేసింది.

Read This: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వాహనమిత్ర అమలుకు ఉత్తర్వులు జారీ..

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..